telanagana
రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడిగా కోట వేణు ఎన్నిక
సూర్య, దస్తూరాబాద్ : పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కోట వేణు 8వసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఉపాధ్యాయులు, పీఆర్టీయూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంఘం బలోపేతానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన కోట వేణుకు పలువురు అభినందనలు తెలియజేశారు