BREAKING
నిర్మల్ జిల్లా  అదనపు కలెక్టర్‌గా డి. వెంకట మాధవ రావు బాధ్యతల స్వీకరణ మున్సిపాల్టీల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం మొరంపల్లిలో త్రాగనీటి కష్టాలు అరేంపులలో అంగరంగ వైభవంగా సరస్వతీ పూజోత్సవం చిల్లర రాజకీయాలు మానుకో ప్రతాప్ రెడ్డి భట్టిప్రోలు మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - ముసాయిదా జాబితా విడుదల జనసేనకు ఝలక్.....* జిల్లాలో నో చాన్స్ పురపోరు.. తొలిరోజు జీరో..! NI Act (చెక్ బౌన్స్) కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణ తొలి రోజు ప్రారంభమైన నామినేషన్ లు:.. టిడిపి నామినేషన్ లు నాలుగు, ఇండిపెండెంట్ లు రెండు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ఎల్.కోట శ్రీ సీతారామ స్వామి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కరీనా ఆ వింత అలవాటు వల్ల మా బెడ్‌రూమ్ రాత్రిపూట దాబా లాగా మారుతుంది.. సైఫ్ అలీ ఖాన్ సరదా కామెంట్స్ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు.... కేశంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరిక

ఎన్నికల కేంద్రాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు ముందుగానే పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*

Select Suryaa Now
ఎన్నికల కేంద్రాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు ముందుగానే పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*

 

*ఎన్నికల నిర్వహణలో పటిష్ట బందోబస్తు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలి – జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్*

కర్నూలు, అక్టోబర్ 16, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

శుక్రవారం గూడూరు మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణం ఇండోర్ భవనంలో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...ఎన్నికల సిబ్బంది, అధికారుల సౌకర్యార్థం డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలని  కలెక్టర్ సూచించారు. కేంద్రానికి వచ్చే వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు స్పష్టమైన ప్రణాళిక రూపొందించి, ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రానికి సుమారు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి, సిబ్బంది సులభంగా రాకపోకలు సాగించేలా మార్గాలను సిద్ధం చేయాలన్నారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు, తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించిన మార్గదర్శక బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల నిర్వహణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, తిరిగి స్వీకరణ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరగాలని తెలిపారు. కౌంటింగ్ హాళ్లలో రిటర్నింగ్ అధికారి టేబుల్‌తో పాటు ఇతర టేబుళ్లను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అమర్చాలని, వార్డు వారీగా, టేబుల్ వారీగా సామగ్రిని గుర్తించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి భోజనం, అల్పాహారం, తాగునీరు,  పరిశుభ్రమైన మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచడంతో పాటు అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహించి, కేంద్రాలకు సంబంధించిన లేఅవుట్ మ్యాప్‌తో సహా అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

*ఎన్నికల నిర్వహణలో పటిష్ట బందోబస్తు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలి – జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్*

ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన శాంతిభద్రతల చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు సూచించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేసి, వాహనాల రద్దీని నియంత్రించాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, అధికారులు, ఏజెంట్లకు నిబంధనల ప్రకారం ప్రత్యేక మార్గాలు కేటాయించి, అనధికార వ్యక్తులు కేంద్రాల్లోకి ప్రవేశించకుండా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉండేలా చూడాలని, ఎన్నికల సామగ్రి భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ముందస్తు భద్రతా ప్రణాళికను అమలు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, ప్రవేశ నియంత్రణ, పోలీసు బందోబస్తు విషయంలో నిర్దేశిత విధానాలను పాటించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియం వద, గూడూరు నగర పంచాయతీ కమిషనర్ ఏ.వి. రమేష్ బాబు, తహశీల్దార్ వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.