పురపోరు.. తొలిరోజు జీరో..!
పురపోరు.. తొలిరోజు జీరో..!చీరాల: చీరాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. పట్టణంలోని 44 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ నెల 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. దీంతో చివరి రెండు రోజుల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకునే అవకాశముంది. ఏ వార్డులో ఎంతమంది బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.