ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ధర్మసాగర్, మేజర్ న్యూస్, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలతో ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు కార్యాలయంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో మేన శ్రీను, జడ్పి సీఈవో శేషాద్రి, ఎంపీడీవో అనిల్ కుమార్, మండలరివెన్యూ అధికారి భావుసింగ్, ఎంపీవో అఫ్జల్ పాషా, వివిధ గ్రామాల సర్పంచ్ లు, జీపీ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్: కొట్టే పద్మయ్య, ధర్మసాగర్, హన్మకొండ జిల్లా*