BREAKING
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ఎల్.కోట శ్రీ సీతారామ స్వామి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కరీనా ఆ వింత అలవాటు వల్ల మా బెడ్‌రూమ్ రాత్రిపూట దాబా లాగా మారుతుంది.. సైఫ్ అలీ ఖాన్ సరదా కామెంట్స్ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు.... కేశంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరిక లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటండి... ఎమ్మెల్యే " కోండ్రు " కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక స్కూల్ గ్రాంట్ల చెల్లింపుల్లో గందరగోళం... పాత విధానంలోనే ఎస్‌ఎంసీ ఖాతాల్లో నిధులు జమ చేయాలి అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. తాసిల్దార్. కార్పొరేటర్ అభ్యర్థిగా రేవళ్ళ సత్యనారాయణ నామినేషన్ రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడిగా కోట వేణు ఎన్నిక విద్యాలక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు...! ఆంధ్రకు నీళ్లు - తెలంగాణకు కన్నీళ్లు

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్

పార్వతీపురం, సూర్య : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ స్పష్టం చేశారు. అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం పార్వతీపురంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను, అక్కడ చేసిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల వద్ద ఎలాంటి గందరగోళం తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో ముగిసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.