టిడిపిలోకి 300 కుటుంబాలు చేరిక
నెల్లిమర్ల, సూర్య : మండలంలోని పూతికపేట గ్రామ సర్పంచి లెంక గోవిందరావు, మాజీ వార్డు సభ్యులు సహా 300 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరాయి. విజయనగరంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా అధికారికంగా టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గేదెల రాజారావు ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం విజయవంతమైంది. సర్పంచి గోవిందరావుతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నాయకురాలు సిరిసహస్ర టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నాయకులు చిక్కాల సాంబశివరావు, పతివాడ గోవిందరావు, మడ్డు సూర్యనారాయణ, సుంకరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.