ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి.... ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి
గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతముగా పారదర్శకంగా నిర్వ హించేందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్య నారాయణ వెల్లడించారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యద ర్శులు,గ్రామ రెవెన్యూ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పై ప్రత్యేక సమావేశమును నిర్వహించా రు.ఈసందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని గ్రామ పంచాయతీల పరిధిలో అమలు చేసే అంశంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులకు ఎంపీ డీవో నడిమింటి సూర్యనారాయణ తగు సూచనలు,సలహాలను అంద జేశారు.అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్య నారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో రాజకీయ ప్రతినిధులు కోడ్ ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని నిబంధ నల అమలకు తగిన చర్యలు తీసుకో వాలని తెలియజేశారు.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమల్లోకి రావడం జరిగింద న్నారు.అదే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు.అదే విధంగా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలన్నారు.గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమాలని పగడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు తగు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.ఈసమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం పరి పాలనాధికారి నాలి అర్జునరావు, డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటే శ్వరరావు,గ్రామ పంచాయతీ కార్యద ర్శులు బంటు అప్పారావు,సూరు శ్రీనివాసరావు,తిరుపతి భాస్కరరావు, రంభ శశిభూషణరావు,మరడాన భార్గవ్ ,నీరస రవికుమార్, బొంతల వైకుంఠరావు, అడ్డూరి లలితకుమారి, కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాస రావు,గుంట్రేడ్డి కృష్ణప్రసాద్, అలజంగి శ్రీకాంత్, గంట విజయలక్ష్మి,డాకోజు సూర్యప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.