BREAKING
ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి.... ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది. బతుకమ్మ వేడుకలకు ముస్తాబు భారత్‌ ఐటీ రంగానికి స్వల్ప బిగ్‌ షాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను వేలం వేయడం చట్టరీత్యా నేరం* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు వీరిలో చైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఎవరిని వరించెనో ? భీమ్‌గల్ లో వ్యక్తి ఆత్మహత్య పెద్ది చిత్రంలోని ఎమోషనల్ ఆసుపత్రి సన్నివేశంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎనిమిది గంటల్లోనే పూర్తి పార్వతీపురంలో ఘనంగా "వస్త్ర జగదాంబ" జాకీ బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కొత్తగూడలో ఘనంగా కుంకుమ పూజ ఎంపీ మెదన్ రెడ్డి పై దాడి పిరికిపందల చర్య మాజీ ఎమ్మెల్యే బియ్యపు

అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి

Select Suryaa Now
అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి

మర్పల్లి, మేజర్ న్యూస్: అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని టీఆర్ఎస్ మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతుబంధు, రైతు భరోసా పథకాల అమలులో కోతలు విధించడంతో పాటు విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులతో మర్పల్లి మండల రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మర్పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో నిర్మించిన 112 డబుల్ బెడ్రూం ఇళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటికి అవసరమైన మరమ్మతులు చేపట్టి అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్, అశోక్, మధు, మోహన్ రెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.