సరస్వతీ దేవి అలంకారంలో విశాలాక్షి అమ్మవారుదేవీ నవరాత్రుల ఆరో రోజు భక్తులకు జ్ఞానప్రదాయిని దర్శనం
శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు విశాలాక్షి అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
విద్య, జ్ఞానం, వివేకం, కళలకు ప్రతీకగా కొలిచే సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుని తమకు జ్ఞానం, విద్య, సకల శుభాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.
పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జి ఏలూరు