ఆశావహులు సంయమనంపాటించాలి, ఎమ్మెల్యే రోషన్ కుమార్,
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్ మండల టీడీపీ నాయకులతో సూర్య ఫంక్షన్ హాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల పార్టీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవులను ఆశిస్తున్న వారు పార్టీ అధిష్టానం అధికారిక నిర్ణయం వెలువడే వరకు సంయమనం పాటించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు.నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పదవులు ఆశిస్తున్న వారి వివరాలను సేకరించి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా ద్వారా వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు.ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం మండలంలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ కె వి రమణ రావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా