పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఖరారు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జోగారావు
పార్వతీపురం, సూర్య : మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ఖరారు చేస్తు వారికి ఆశీస్సులు అందిస్తూ ఎన్నికల బరిలో మొదటి ఘట్టం నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సభ్యులు అందరికీ ఆయన పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పురపాలక సంఘం 13వ వార్డు వైసిపి అభ్యర్థిగా పెద్దపొందరీ తిరుపతి (బాలు)ను, 20వ వార్డు అభ్యర్థిగా నగిరెడ్డి రాధ, 30వ వార్డు వైసిపి అభ్యర్థిగా కోరాడ శేఖర్, 31వ వార్డు అభ్యర్థిగా సారిక సుధాకరరావు (భవాని) లను ఖరారు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న పుర పోరులో విజయం సాధించి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా రావాలని పిలుపు ఇవ్వడం జరిగినది.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.