BREAKING
రణబాలి’ చూసి కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ తల్లి.. ఓదార్చిన రశ్మిక మందన్న *బస్వాపూర్ లోని బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులను సందర్శించి డీఆర్డీఓ జయదేవ ఆర్య* ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఇట్లు అర్జున’ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది.. కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వేషం మార్చాడు.. బుద్ధి మార్చుకోలేదు: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ నిప్పులు దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు మింట్ మొబైల్ విక్రయం.. హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్ల లాభం పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు పుంగనూరులో అరాచకం వైసీపీ నాటకాలకు స్వస్తి చెప్పాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల వివాదంపై తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం.. బయటి వ్యక్తులతో ఘర్షణలు సృష్టించడం తగదు డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు తాడేపల్లి డైరెక్షన్‌లో గొడ్డలి ముఠా అల్లర్లు -హింస ద్వారా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్ర : నరసింహ యాదవ్ ఆరోపణ వైసిపి రెచ్చగొట్టే ధోరణి గొడవలకు కారణం: మంత్రి సత్య కుమార్ యాదవ్ కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి ఉత్సవాన్ని విజయవంతం చెయ్యండి

Select Suryaa Now
శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి ఉత్సవాన్ని విజయవంతం చెయ్యండి

పాలకొండ, సూర్య :  శ్రీ కోటదుర్గ అమ్మ వారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించనున్న తిరువీధి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆలయ ఈవో వి.వి. సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో శుక్రవారం డిఎస్పి ఎం.రాంబాబు, సీఐ ఏ.ప్రసాద్, ప్రధాన అర్చకులు సమావేశమై కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా డిఎస్పి రాంబాబు మాట్లాడుతూ తిరువీధి కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకే ప్రారంభించాలని సూచించారు. అంతకుముందు నిర్వహించాల్సిన ఆయుధపూజతో పాటు అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకే ఆయుధ పూజ ప్రారంభించి అరగంటలో పూర్తి చేస్తామని, అనంతరం అమ్మవారి పూజలు నిర్వహించి తిరువీధి కార్యక్రమానికి సిద్ధం చేస్తామని తెలిపారు. ఉత్సవాలన్నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందోత్సాహాల మధ్య జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐలు శివప్రసాద్, నీలకంఠరావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ, సీసీ వీరాజారావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.