BREAKING
నెస్లే ఇండియా క్యూ2 ఫలితాల సమీక్ష: అంచనాలను మించినా ద్రవ్యోల్బణ భయాలు.. సంపాదన అంచనాలు, టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన బ్రోకరేజీలు అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం. బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ అర్బన్ కంపెనీ క్యూ2 ఫలితాలు: రెట్టింపునకు పైగా పెరిగిన నికర నష్టం.. 41 శాతం ఎగబాకిన ఆదాయం! 7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌ అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.'' జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు అన్రుధ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బర్త్‌డే వేళ వైరల్ అవుతున్న నెట్ వర్త్ వివరాలు జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. : నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలి స్టాక్ మార్కెట్లలో జోరు: 414 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 27 వారాల్లో నిఫ్టీకి అత్యుత్తమ వీక్లీ లాభాలు, 8 శాతం దూసుకెళ్లిన టెక్ మహీంద్రా! పంట చేతికొచ్చే వేళ.. విద్యుత్‌ అంతరాయాలు వద్దు! లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కరోనా కంటే ఎల్ నినో ప్రభావం ప్రమాదకరం

Select Suryaa Now
కరోనా కంటే ఎల్ నినో ప్రభావం ప్రమాదకరం

పాల్మాకుల్ గ్రామ సర్పంచ్ కోటేశ్వర్ గౌడ్ 

శంషాబాద్ : కరోనా కంటే ఎల్ నినో ప్రభావం అత్యంత ప్రమాదకరమని పాల్మాకుల్ గ్రామ సర్పంచ్ కటికూరి కోటేశ్వర్ గౌడ్ అన్నారు.శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల్ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో నీటి వినియోగం, నీటి ఎద్దడి లేని పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కోటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం సూపర్ ఎల్ నినో వల్ల దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. అందులో భాగంగా పాల్మాకుల్ గ్రామంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, బాధ్యతగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రైతులు ప్రభుత్వ వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని, వరి పంట సాగును తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాబ్ కార్డులు తీసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని, గ్రామంలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని ఆయన కోరారు.