రాష్ట్ర పిఆర్టియు కార్యవర్గంలో మర్కుక్ మండలానికి చెందిన టీచర్లకు చోటు
మార్కుక్ ;మండలానికి పిఆర్టియు రాష్ట్ర కార్యవర్గంలో ఘన గౌరవం పిఆర్టియు ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి భిక్షమయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బట్టాపురం మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మార్కుక్ మండల శాఖ నుంచి 11మందికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించడం ఎంతో అభినందనీయమని నాయకులు తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా కొత్త నరేందర్ రెడ్డి, రేబల్లి శ్రీనివాసరావు, కూచి రెడ్డి, వై.వెంకట నరసింహారెడ్డి,రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షులు శ్రీమతి సి.రజిత కే. నరసింహులు, అసోసియేట్ అధ్యక్షులు, ఎం.డి. షాబుద్దీన్, యాది రెడ్డి, శ్రీధర్, సరితా దేవి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా , రాష్ట్ర కార్యదర్శిగా ఏడెల్లి బాలకృష్ణ నియమితులయ్యారు.తమ ఎన్నికకు సహకరించిన మార్కుక్ మండల అధ్యక్షులు నారెడ్డి రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మ కుమార్లకు నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంఘ నిర్మాణం బలోపేతం కోసం మరింత పట్టుదలతో పనిచేస్తామని వారు తెలిపారు. మార్కుక్ మండలానికి రాష్ట్ర స్థాయిలో లభించిన ఈ ప్రాతినిధ్యం పట్ల పిఆర్టియు శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.