8 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోండి ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు – తహసీల్దార్ అశోక్
8 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకోండి
ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు
– తహసీల్దార్ అశోక్
కొండాపూర్;ప్రత్యేక ప్రచార దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులైన యువతీ యువకులు ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ అశోక్ సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన వారు అవసరమైన వివరాలతో దరఖాస్తు చేసుకుని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ అశోక్ సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులెవరూ నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.