క్రీడలతో మానసిక ఒత్తిడికి దూరం.... ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి క్రికెట్ టోర్నమెంట్లు దోహద పడతాయి.
- ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
కొందుర్గు: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి క్రికెట్ టోర్నమెంట్లు దోహద పడతాయని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జై భీమ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-6 పోటీలను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని, క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి, పరస్పర సోదరభావానికి తోడ్పడతాయని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ, మహదేవ్ పూర్ సర్పంచి అనుష రవీందర్ రెడ్డి, నాయకులు సుందర్, వాసూరి, విశ్వనాథ్ పూర్ సుండు రాములు, ఉత్తరాసిపల్లి డిప్యూటి సర్పంచి అలీం, ఉమ్మెంత్యాల మాజి సర్పంచి నర్సిములు, అయోద్య పూర్ మాజి సర్పంచి గొపాల్ నాయక్, గంగన్న గుడెం మాజి సర్పంచి శేఖర్, జనార్థన్ గౌడ్, కొందుర్గ్ రఘనాథ్ గౌడ్, శ్రీరంగ పూర్ యదయ్య, బైరం పల్లి శ్రీకాంత్, టేకులపల్లి కృష్ణ, తంగెళ్లపల్లి రవిందర్ రెడ్డి, ప్రవీణ్, సందీప్, లాలాపేట నవాజ్ రెడ్డి, విజయ్ కుమార్, లక్ష్మణ్, అనంత రాములు, మురళీధర్ రెడ్డి, కృష్ణ రెడ్డి,రాజశేఖర్, ప్రభాకర్, బుట్ట యాదగిరి తదితరులు
పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.