అలూర్–ధని గ్రామాల మధ్య నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
సూర్య,సారంగాపూర్ : మండలం లోని అలూర్ గ్రామం నుంచి ధని గ్రామం వరకు రూ.3 కోట్ల 60 లక్షల సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, శుక్రవారం రోజు శంకుస్థాపన చేశారు.ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అలూర్, ధని గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ రహదారి నిర్మాణం దోహదపడనుంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈర్ల చిన్నయ్య,మండల అధ్యక్షుడు కాల్వ నరేష్, మండల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.