BREAKING
బూర్గులలో తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు... నెస్లే ఇండియా క్యూ2 ఫలితాల సమీక్ష: అంచనాలను మించినా ద్రవ్యోల్బణ భయాలు.. సంపాదన అంచనాలు, టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన బ్రోకరేజీలు అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం. బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ అర్బన్ కంపెనీ క్యూ2 ఫలితాలు: రెట్టింపునకు పైగా పెరిగిన నికర నష్టం.. 41 శాతం ఎగబాకిన ఆదాయం! 7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌ అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.'' జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు అన్రుధ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బర్త్‌డే వేళ వైరల్ అవుతున్న నెట్ వర్త్ వివరాలు జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. : నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలి స్టాక్ మార్కెట్లలో జోరు: 414 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 27 వారాల్లో నిఫ్టీకి అత్యుత్తమ వీక్లీ లాభాలు, 8 శాతం దూసుకెళ్లిన టెక్ మహీంద్రా!

ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి -  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ ప్రతినిధి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్న నమ్మకం కలిగేలా అధికారులు, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
శుక్రవారం భైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వివరాలతో పాటు ప్రతిరోజూ నమోదయ్యే ఓపీ, ఇన్‌పేషెంట్‌ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, అందిస్తున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు నిరంతరాయంగా సేవలు అందించాలని సూచించారు.ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించిన కలెక్టర్, అన్ని వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించారు. డయాలసిస్‌ కేంద్రం, నవజాత శిశువుల విభాగం, రక్త పరీక్షల గది, మందుల గదితో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలను సకాలంలో నిర్వహించాలని సూచించారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వైద్య సేవలు, మందులు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు.ఆసుపత్రిలో పటిష్టమైన అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అగ్నిమాపక పరికరాలను పరిశీలించి, వాటి పనితీరు, గడువు తేదీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో 24 గంటలూ సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ తనిఖీలో డీసీహెచ్‌ఎస్‌ కాశీనాథ్, తహసీల్దార్ శశిభూషణ్, మున్సిపల్ కమిషనర్ సంతోష్, ఇతర అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.