చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు?
సూర్య చింతల మానేపల్లి..కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాచింతలమనేపల్లి మండలంలోని కర్జెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలోకి వెళ్లే చెరువు కట్ట రహదారి గత కొన్ని సంవత్సరాలుగా గుంతలమయమై అధ్వానంగా మారింది. రహదారిపై ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఎడ్లబండ్లపై వెళ్లేవారు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నడిచి వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి దుస్థితి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి, శాశ్వతంగా రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ఎంపీడీఓఆఫీస్ లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కర్జెల్లి గ్రామ చెరువు కట్ట రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.