BREAKING
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పశ్చిమాసియాలో దెబ్బతిన్న ఇంధన సదుపాయాలు కలల్ని కనండి.. వాటిని సాకారం చేసుకోండి •యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం •జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అమెరికా సెనేట్ ఎన్నికల ఫలితాల అంగీకారంపై అభ్యర్థుల దాటవేత పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధ సెల్లింగ్ ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాల్లో కెనడా టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంఘీభావం నీటిని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షిద్దాం : బొక్క నరసింహారెడ్డి కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి దాడులు ఉట్స్సారంగపల్లిరైతు వేదిక లో ఘనంగా బతుకమ్మ సంబరాలు... అర్మేనియాలో ఆస్తులు, రష్యాతో వాణిజ్య చరిత్రపై పెరుగుతున్న ఆందోళనలు ఆకాశాన్నంటుతున్న ఇంధన రవాణా వ్యయం హారర్ జానర్‌తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సహస్ర కుంకుమార్చన పూజలు వికాస్‌ జ్ఞాపకార్థం రక్తదానం... మిత్రబృందం మానవీయ సేవలు • నగర మేయర్‌ అభినందనలు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

అన్నమయ్య జిల్లా మదనపల్లె, అక్టోబర్ 15: మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

గురువారం మదనపల్లెలోని దొంతి లేఅవుట్ వద్ద, మున్సిపల్ వాహన పార్కింగ్ సమీపంలో ఉన్న సహాయ ఎన్నికల అథారిటీ నూతన భవనంలో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ గదులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ప్రమీల వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

శ్రీనివాసులు స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి