BREAKING
కొబ్బరి మొక్కలకు ద్రవ జీవామృతం పారిశుధ్య కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత ఢిల్లీలో కాక్రోచ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌! వర్షాల కోసం కప్పతల్లి ఊరేగింపు స్విట్జర్లాండ్‌లో బ్యాంకింగ్ కుంభకోణాన్ని వెలికితీసిన సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ అభియోగాలు అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్ భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు. అక్షిత విద్యార్థిని నీట్ కోచింగ్ కు సర్పంచ్ ఇమ్మడి మహేష్ ఆర్థిక చేయూత రాబోయే శీతాకాలం వేళ ఉక్రెయిన్‌కు ఉపశమనం వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు ఓటుకు నోటును తిరస్కరిద్దాం.. విలువైన ఓటు కు విలువనిద్దాం... ...... విద్వాన్ జ్యోతి చంద్రమౌళి...... శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు హంగేరీ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

మార్టూరు, మేజర్ న్యూస్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్టూరులోని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ భవనం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలాం చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, డాక్టర్ అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష విజయాలు సాధించడంతో పాటు, యువతలో స్ఫూర్తిని నింపిన మహనీయుడని కొనియాడారు. విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు అధ్యక్షులు కొర్రపాటి సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షులు రావి అంకమ్మ చౌదరి, మాదాల సాంబశివరావు, మద్దుమాల కోటేశ్వరరావు, రోటేరియన్లు చింతల సుబ్బారావు, వి.వి. శేషుబాబు, చల్లగుండ్ల శ్రీనివాసరావు, మోటుపల్లి అంకయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామారావు పాల్గొన్నారు. విద్యార్థులు మాదాల నందన, షేక్ ఉజమా బేగం, కొర్రపాటి తనుశ్రీ, కొర్రపాటి వెంకట హవిష్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.