BREAKING
సామాజిక చైతన్యం కోసం పిట్టలదొర వేషం.... బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. మొదటి రోజే రూ. 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న సినిమా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు.. బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న నటుడు ఇమ్రాన్ ఖాన్ ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శ్రీరాముని ఆశీస్సులు కోరిన యామీ గౌతమ్.. అయోధ్య రామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Select Suryaa Now
సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

 తెలంగాణ బ్యూరో ప్రతినిధి: సింగరేణి కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తమ ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. సింగరేణి కార్మికులకు ఇళ్లు నిర్మించడంతోపాటు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ గోదావరిఖని పర్యటన సినిమా ప్రమోషన్ కోసమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుకరిస్తూ గడ్డం, మీసాలు పెంచుకోవడం ద్వారా ప్రజలను నమ్మించలేరన్నారు.

బీఆర్ఎస్  హయాంలో సింగరేణిని నాలుగు భాగాలుగా చేసి కల్వకుంట్ల కుటుంబం బొగ్గు, బూడిద, మట్టిని దోచుకుందని ఆరోపించారు. సింగరేణి సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఎల్‌నినో ప్రభావానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాధ్యుడిగా పేర్కొనడం హాస్యాస్పదమని వీరేశం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు ముడిపెట్టవద్దని సూచించారు. గతంలోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వాటికి బాధ్యుడిగా కాంగ్రెస్ నిందించలేదని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు కేటీఆర్ సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణను త్వరగా పూర్తి చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను వేగవంతం చేయాలని కోరాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించడమే కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని వీరేశం ఆరోపించారు.