BREAKING
ఉత్తర ఐర్లాండ్ మాజీ నేత జెఫ్రీ డోనాల్డ్‌సన్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పశ్చిమాసియాలో దెబ్బతిన్న ఇంధన సదుపాయాలు కలల్ని కనండి.. వాటిని సాకారం చేసుకోండి •యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం •జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అమెరికా సెనేట్ ఎన్నికల ఫలితాల అంగీకారంపై అభ్యర్థుల దాటవేత పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధ సెల్లింగ్ ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాల్లో కెనడా టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంఘీభావం నీటిని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షిద్దాం : బొక్క నరసింహారెడ్డి కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి దాడులు ఉట్స్సారంగపల్లిరైతు వేదిక లో ఘనంగా బతుకమ్మ సంబరాలు... అర్మేనియాలో ఆస్తులు, రష్యాతో వాణిజ్య చరిత్రపై పెరుగుతున్న ఆందోళనలు ఆకాశాన్నంటుతున్న ఇంధన రవాణా వ్యయం హారర్ జానర్‌తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సహస్ర కుంకుమార్చన పూజలు

ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్:దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడిని సంతరించుకున్నాయి. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, దేవస్థానం ఈవో వీ.కె. శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు పర్యవేక్షణలో పోలీసు శాఖ భద్రతను పటిష్ఠం చేసింది. కృత్రిమ మేధస్సు ఆధారిత రద్దీ విశ్లేషణ, సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా భక్తుల రాకపోకలను పర్యవేక్షిస్తూ, రద్దీ ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర పర్యవేక్షణలో క్యూలైన్లు, భక్తుల రాకపోకల మార్గాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు చర్యలు చేపట్టారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, తాత్కాలిక మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ సమయంలో భక్తులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. వృద్ధులు, చిన్నారులకు సిబ్బంది మార్గనిర్దేశం చేస్తున్నారు. దేవాదాయశాఖ, జిల్లా యంత్రాంగం, పోలీసు, నగరపాలక, వైద్యశాఖలు, సేవా సంస్థల సమన్వయంతో భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణ పాటిస్తూ అధికారుల సూచనలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.