వైసీపీలో చేరిన టిడిపి కార్యకర్తలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
కపిలేశ్వరపురం మండలంలోని అద్దంకివారిలంక, పల్లపులంక గ్రామాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వైసిపి వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయంలో మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ, రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు తోట త్రిమూర్తులు సమక్షంలో వీరంతా వైసీపీ లో చేరినట్లు తెలిపారు. అద్దంకివారిలంక వైసిపి పార్టీ అధ్యక్షుడు కొండేటి వెంకన్న ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి తోట త్రిమూర్తులు వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.…
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలు సైతం చంద్రబాబు నాయుడు మోసాలను గ్రహించి వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామంటూ కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా పేదలకు ఒక్క సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారైనా అర్హత ఉంటే చాలు, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని కొనియాడారు.కొత్తగా చేరిన వారికి సముచిత గౌరవం.…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత అనే తారతమ్యాలు ఉండవని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, అందరికీ సముచిత స్థానం, తగిన గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీలో చేరిన కార్యకర్తలు వీరే..
ఈ కార్యక్రమంలో నాగిడి నూకరాజు, మసకపల్లి ఆంజనేయులు, కోలాబత్తుల సుబ్బారాయుడు, సకిలే సుబ్రహ్మణ్యం, బూరుగు దుర్గారావు, సఖిలే నాగరాజు, కుసుమ శ్రీను, దాకి వెంకటేశ్వరరావు, పోలిమాటి వెంకటరమణ, కొత్తపల్లి లావరాజు, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు వైసీపీ కండువాలు కప్పుకున్నారు.
ఈ చేరికల కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పుట్టపూడి బాబు, మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, మండల కన్వీనర్ గూటం సత్యనారాయణ, సలాది వీరబాబు, దొరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు