BREAKING
కొబ్బరి మొక్కలకు ద్రవ జీవామృతం పారిశుధ్య కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత ఢిల్లీలో కాక్రోచ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌! వర్షాల కోసం కప్పతల్లి ఊరేగింపు స్విట్జర్లాండ్‌లో బ్యాంకింగ్ కుంభకోణాన్ని వెలికితీసిన సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ అభియోగాలు అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్ భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు. అక్షిత విద్యార్థిని నీట్ కోచింగ్ కు సర్పంచ్ ఇమ్మడి మహేష్ ఆర్థిక చేయూత రాబోయే శీతాకాలం వేళ ఉక్రెయిన్‌కు ఉపశమనం వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు ఓటుకు నోటును తిరస్కరిద్దాం.. విలువైన ఓటు కు విలువనిద్దాం... ...... విద్వాన్ జ్యోతి చంద్రమౌళి...... శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు హంగేరీ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

ఒంగోలు ఆవుకు పుంగనూరు దూడ జననం

Select Suryaa Now
ఒంగోలు ఆవుకు పుంగనూరు దూడ జననం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

మండల పరిధిలోని ఏడిద సావరం రోడ్డులో ఓ అరుదైన దూడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానికంగా నివసిస్తున్న మల్లిపూడి శ్రీనుకు చెందిన ఒంగోలు ఆవుకు ఇటీవల పుంగనూరు జాతి లక్షణాలతో కూడిన పెయ్యి దూడ జన్మించింది.

కేవలం 17 అంగుళాల ఎత్తు, రెండు అడుగుల పొడవుతో ఉన్న ఈ చిట్టి దూడ ఎంతో ముద్దుగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. చిన్నపాటి శరీరాకృతితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.దసరా పండుగ సందర్భంగా తమ ఇంట్లో పెంచుకుంటున్న ఆవుకు ఇలా పెయ్యి దూడ జన్మించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు యజమాని మల్లిపూడి శ్రీను తెలిపారు. పండుగ వేళ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లుగా భావిస్తూ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిట్టి దూడను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి దసరా పండుగ వేళ జన్మించిన ఈ బుజ్జి దూడ ఏడిద ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.