ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలూరి •కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఇంకొల్లు, మేజర్న్యూస్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఏలూరి కుటుంబం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని ఏలూరి కుటుంబం భక్తిభావాన్ని చాటుకుంది.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.