BREAKING
శ్రీ కోటదుర్గ ఆలయం లో గోడ పత్రిక విడుదల కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్.

గుర్తింపునకు నోచుకోని పెద్దూర్ కాలనీ - మూడేళ్లుగా ఓటు హక్కుకు దూరం

Select Suryaa Now
గుర్తింపునకు నోచుకోని పెద్దూర్ కాలనీ - మూడేళ్లుగా ఓటు హక్కుకు దూరం
సూర్య రాజన్న సిరిసిల్ల ;సొంత ఇంటి కల నెరవేరింది,ఆ ఇంటికి గుర్తింపే లేకుండా పోయింది.ఇది సిరిసిల్లలోని పెద్దూర్ డబుల్ బెడ్‌రూమ్ వాసుల పరిస్థితి.39వ వార్డు పరిధిలోని పెద్దూర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో గత మూడు సంవత్సరాలుగా దాదాపుగా 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.గత ప్రభుత్వం ఇళ్లు కేటాయించి చేతులు దులుపుకుందే తప్ప,కనీసం ఇంటి నంబర్లు కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.ఓటు హక్కు లేదు..ఇంటి నంబర్ లేకపోవడంతో ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు కావడం లేదని,దీంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుకు దూరమయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆధార్,రేషన్ కార్డుల్లో అడ్రస్ మార్పు,పిల్లల చదువులు,బ్యాంకు లావాదేవీలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
 
కలెక్టర్ ఆదేశించినా కదలిక లేదు:
 
ఇదే విషయమై గతంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా,మున్సిపల్ కమిషనర్‌కు ఇంటి నంబర్లు కేటాయించి ఓటు హక్కు కల్పించాలని ఆదేశాలు ఇచ్చారని,అయినా అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.తమకు ఇంటి నంబర్లు కేటాయించి,ఓటు హక్కు కల్పించి గుర్తింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో కాలనీవాసులు రాహుల్,అశోక్,మోహన్, సంతోష్,మహేష్ కుమార్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.