BREAKING
మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు.. అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి బసవతారకం మెడికల్ క్యాంపును సందర్శించిన మా రెడ్డి లతా రెడ్డి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ ఉచిత మెగా వైద్య శిబిరం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక.

ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స

Select Suryaa Now
ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స

హైదరాబాద్‌, గుండె నుంచి శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం (అయోర్టా) గోడ చీలిపోయిన 61 ఏళ్ల వ్యక్తికి కిమ్స్‌ కొండాపూర్‌ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా చికిత్స అందించారు. ఛాతీ తెరిచి చేసే పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా.. స్థానిక మత్తుతోనే రక్తనాళంలో ప్రత్యేక స్టెంట్‌ అమర్చి చీలిన భాగాన్ని సరిచేశారు. చికిత్స అనంతరం రెండో రోజే రోగి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్, ఆర్టరీ & వెయిన్ మరియు డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ డాక్టర్ నిషాన్ రెడ్డి బి మరియు కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్, డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్  డా. యార్లగడ్డ వెంకన్న చౌదరి మరియు డా. మీనారెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన కెశవరెడ్డి (61)కి వృత్తిరీత్యా పోలీసు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తిని కిమ్స్‌ కొండాపూర్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షలు నిర్వహించగా ప్రధాన రక్తనాళమైన అయోర్టాలోని దిగువ ఛాతీ భాగంలో చీలిక (టైప్‌-బి అరోటిక్‌ డిసెక్షన్‌) ఉన్నట్లు సీటీ యాంజియోగ్రామ్‌లో గుర్తించారు. ఈ చీలిక ఎడమ సబ్‌క్లేవియన్‌ ధమని ప్రారంభ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ రక్తనాళం ఎడమ చేతికి, మెదడు, వెన్నుపాముకు రక్త సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఛాతీ తెరిచి పెద్ద శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది లేదా స్టెంట్‌ గ్రాఫ్ట్‌ అమర్చే సమయంలో ఎడమ సబ్‌క్లేవియన్‌ ధమనిని మూసివేయాల్సి రావచ్చు. దీనివల్ల ఎడమ చేతికి రక్తప్రసరణ తగ్గడం, పక్షవాతం, వెన్నుపాముకు రక్తప్రసరణ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో థొరాసిక్‌ ఎండోవాస్క్యులర్‌ అరోటిక్‌ రిపేర్‌ (TEVAR) పద్ధతిని ఎంచుకున్నాం. సాధారణంగా అందుబాటులో ఉండే స్టెంట్‌ గ్రాఫ్ట్‌ను రోగి అయోర్టా నిర్మాణానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులు చేశాం. ఎడమ సబ్‌క్లేవియన్‌ ధమని వద్ద ఖచ్చితమైన స్థానంలో చిన్న రంధ్రాన్ని (ఫెనెస్ట్రేషన్‌) రూపొందించి స్టెంట్‌ను అమర్చాం. దీంతో అయోర్టా లోని చీలిక మూసుకుపోవడంతో పాటు ఎడమ చేతికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో రక్తప్రసరణ కొనసాగింది. చిన్న రక్తనాళ మార్గాల ద్వారా స్థానిక మత్తుతోనే ఈ చికిత్సను నిర్వహించాం. అనంతరం నిర్వహించిన యాంజియోగ్రామ్‌లో స్టెంట్‌ సరైన స్థానంలో ఉన్నట్లు, చీలిక మూసుకుపోయినట్లు, ఎడమ సబ్‌క్లేవియన్‌ ధమనిలో రక్తప్రసరణ సక్రమంగా కొనసాగుతున్నట్లు నిర్ధారించాం.

ఈ చికిత్సకు డాక్టర్‌ నిషాన్‌ రెడ్డి నేతృత్వం వహించగా, డాక్టర్‌ వెంకన్న చౌదరి, డాక్టర్‌ మీనా రెడ్డి సహకరించారు. అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌, నర్సింగ్‌, సాంకేతిక విభాగాల సిబ్బంది చికిత్సలో భాగస్వాములయ్యారు.

“అయోర్టాలో చీలిక ఉన్న ప్రాంతం సంక్లిష్టంగా ఉండటంతో ఎడమ సబ్‌క్లేవియన్‌ ధమనికి రక్తప్రసరణను కాపాడటం కీలకంగా మారింది. రోగి రక్తనాళ నిర్మాణానికి అనుగుణంగా స్టెంట్‌ను మార్పులు చేసి అమర్చడం ద్వారా చీలికను మూసివేయడంతో పాటు రక్తప్రసరణను కొనసాగించగలిగాం. స్థానిక మత్తుతో చికిత్స చేయడం వల్ల రోగి త్వరగా కోలుకున్నారు” అని డాక్టర్‌ నిషాన్‌ రెడ్డి తెలిపారు.

చికిత్స అనంతరం రోగికి ఎలాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తలేదు. త్వరగానే నడవగలిగారు. రెండో రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.  
ఈ సందర్బంగా రోగి భార్య కుటుంబ సభ్యలు మాట్లాడుతూ “పెద్ద శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని చాలా భయపడ్డాం. కానీ చికిత్స తర్వాత రెండు రోజుల్లోనే ఆయన నడుచుకుంటూ ఇంటికి వెళ్లడం ఎంతో ఊరటనిచ్చిందన్నారు”