BREAKING
కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు ఈసారి పండుగ సీజన్‌లో ఆల్కహాల్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందన్న దిగ్గజ రిటైలర్ టెస్కో బీఆర్‌బీ నాయుడుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు..!! ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా

అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ

Select Suryaa Now
అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ

వేంపల్లె మేజర్ న్యూస్:
అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాల ఏర్పాట్లు చేసినట్లు వేంపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్ర ఆహ్వాన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో వాసవిమాత వివిధ అవతరాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, 20వ తేది రాత్రి వివిధ వేషధారణలు, మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లు, విద్యుత్ దీపాల నడుమ వాసవి మాత గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. వాసవి కళ్యాణ మండపంలో సాంస్కృతిక, తదితర వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలు భక్తీ శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ స్వాగత ముఖ ద్వారాలు, పందిర్లు, దీపాలంకరణ తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, కళ్యాణ మండపం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.