BREAKING
గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు.. పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' విద్యుత్ సబ్ స్టేషన్ ముందు టిడిపి ధర్నా బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు

గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్...

Select Suryaa Now
గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్...

ఆనందపురం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆనందపురం మండలంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శొంట్యాం గ్రామానికి చెందిన కోరుకొండ ప్రసాద్ నాయకత్వంలో 200 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం జెండాలు కప్పుకున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పసుపు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు టీడీపీ, జనసేన పార్టీలలో చేరడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కూటమి చేతుల్లోనే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం నమోదు చేయబోతున్నామన్నారు. వైసీపీ రాజకీయ భవిష్యత్ అంధకారం కానుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, అచ్చిబాబు, బోడసింగి రాంబాబు, మదపాక శ్రీను, ఎర్ర రాజు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్  : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.