BREAKING
టీజీఎస్పీ నూతన క్రిమినల్ చట్టాలపై ఒకరోజు శిక్షణా యాసంగిలో తక్కువ నీటితో సాగయే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి:: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అవనిగడ్డ ఎల్ఐసి బ్రాంచి మేనేజర్ కు కు ఘన సన్మానం ఓటు హక్కు పరిరక్షణ కోసం శాంతియుత ర్యాలీ 10న టవర్‌ క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు UJAC ర్యాలీ CEC రాజీనామా చేయాలని.. బ్యాలెట్‌ పేపర్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పూర్వ ప్రాధమిక విద్య ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా దృష్టి సంరక్షణపై అవగాహన ర్యాలీ విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీబీ నిర్మూలనకు జోష్‌ టీమ్‌ ఏర్పాటు అవగాహనతో పాటు బాధితులకు సహకారం అందించడమే లక్ష్యం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి సంతానం లేని దంపతులకు సదావకాశం పెద్ద కుడాలలో రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ యూపీహెచ్‌సీలకు రెగ్యులర్‌ డాక్టర్లను నియమించాలి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సన్నాహక సమావేశం మార్వాడిల దుకాణాల ఎదురుగా కార్మికుల ఆందోళన 87 ఏళ్ల వృద్ధురాలి మృతితో గృహ నిర్మాణ సంక్షోభంపై నేతల పరస్పర విమర్శలు

రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి

Select Suryaa Now
రాజీనామా  ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:

భట్టిప్రోలు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పడమటి శ్రీనివాసరావు గతంలో పార్టీ పదవికి తాను చేసిన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల రీత్యా,అనివార్య పరిస్థితులలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్ పదవికి రాజీనామా చేయటం జరిగిందని,ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని ఉపసంహ పెంచుకుంటున్నట్లు గురువారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వైఎస్సార్‌సీపీ  మండల కన్వీనర్ గా వచ్చిన ఈ సదవకాశాన్ని జారవిడుచుకోవద్దని పార్టీ కి చెందిన పలువురు పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తనతో మాట్లాడడం జరిగిందని, ఈ అంశంపై పునరాలోచించాల్సిందిగా వారు తెలపడం జరిగిందన్నారు. ఆ కారణంగా తన నిర్ణయం పై పునరాలోచన చేసి రాజీనా మాను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తన నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగిందని,ఈ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వేమూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక బాబు సహకారంతో మండల అభివృద్ధి ధ్యేయంగా,పార్టీ సిద్ధాంతాలు,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతాననీ పేర్కొన్నారు.గతంలో తాను పార్టీ కోసం చేసిన సేవలను, కార్యక్రమాలను కొనసాగిస్తూ, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని శ్రీనివాసరావు తెలిపారు. 
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తనపై ఉంచుకున్న నమ్మకానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.