BREAKING
బండి సంజయ్ భవానీ దీక్ష కోకో మొక్కల ఎదుగుదలపై అవగాహన సామంతపూడి పాఠశాలలో ముందస్తు దసరా వేడుకలు. ఎమ్మెల్యే అమిలినేని ఘనంగా సత్కరించిన ప్రైవేట్ పాఠశాలల సంఘం. శాస్త్రవేత్తలు జాబితాలో అంతర్జాతీయ ఖ్యాతి న్యూజిలాండ్‌ ఉద్యోగం పేరుతో రూ.7.50 లక్షలు స్వాహా… బీజేపీ ఆధ్వర్యంలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమం ఉషశ్రీ శతజయంతికి సహకరిస్తాం డాక్టర్ జంధ్యాల, ఎం.సి. దాస్ తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాసేవలో ముందుంటుంది వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు పెద్దల పండుగకు హిందూ స్మశాన వాటికలో ప్రత్యేక శుభ్రత 25 మంది సిబ్బందితో మూడు రోజులుగా పారిశుద్ధ్య పనులు అంగన్వాడీ కార్యకర్తలకు బిజెపి మహిళ మోర్చా సన్మానం పూల సింగిడి.. బతుకమ్మ సందడి!

సంతానం లేని దంపతులకు సదావకాశం

Select Suryaa Now
సంతానం లేని దంపతులకు సదావకాశం


- రేప ఉమాదేవి ఆసుపత్రిలో ఉచిత ఐయుఐ,ఐవిఎఫ్ శిబిరం
- ప్రముఖ గైనకాలజిస్ట్ చింతంరెడ్డి ఉమాదేవి వెల్లడి
మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,విజయభారతి పాఠశాల పక్కన గల ఉమాదేవి ఆసుపత్రి ఆధ్వర్యంలో సంతాన సాఫల్య సమస్యలపై ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చింతంరెడ్డి ఉమాదేవి పేర్కొన్నారు.ఈ సందర్భంగా గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వైద్యశిబిరం రేప అనగా అక్టోబర్ 9వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు.ఈ శిబిరానికి నాతోపాటు,డాక్టర్ అర్చన కార్తీక్ ఎంబీబీఎస్,డిజిఓ,డి.ఎన్.బి,ఎఫ్ఆర్ఎం,ఎఫ్ఐసిఓజి,ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పాల్గొని వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.దీర్ఘకాలంగా సంతానం పొందని దంపతులు,40 సంవత్సరాలు దాటిన వారు,ట్యూబ్స్ మూసుకుపోయిన వారు,తరచుగా గర్భస్రావం అయ్యేవారు,పురుషుల్లో వీర్యకణాల లోపం ఉన్నవారు,అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం తిరిగి గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించబడునన్నారు.ఉచిత ఓపి,ఉచిత స్కానింగ్,పురుషులకు ఉచిత వీర్య పరీక్షలు ఈ శిబిరం ప్రత్యేకత అన్నారు.అలాగే ఐయుఐ,ఐవిఎఫ్,ఐసిఎస్ఐ,ఐఎంఎస్ఐ వంటి సంతాన సాఫల్య చికిత్సలకు సంబంధించిన వైద్య సలహాలు అందించబడునన్నారు.ఉచిత ఓపి నమోదు కొరకు 
8897841666,8247698019 అనే మొబైల్ నెంబర్లను సంప్రదించాలన్నారు.ఈ అవకాశాన్ని మదనపల్లి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని సంతానం లేని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చింతంరెడ్డి ఉమాదేవి పిలుపునిచ్చారు.