BREAKING
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి *విద్యార్థులు క్రమశిక్షణతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి* జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలోగా పరిష్కారం :మంత్రి పొంగులేటి గ్రేడ్‌- పురపాలక సంఘంగా గూడూరు రూపాంతరం ,పుట్ల గట్ల గూడెం దేవలిపల్లి పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం. ప్రజల విశ్వాసాన్ని ఈసీ కోల్పోతోంది హరీశ్ రావు మంత్రి గొట్టిపాటి చొరవతో నిషేధిత జాబితా నుంచి తొలగింపు. పెద్ద చెరువు భూముల భూసేకరణ నిలిపివేయాలి, రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రులకు పటిష్ట పోలీసు బందోబస్తు

మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం

Select Suryaa Now
మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం

 

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

రానున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశించారు. శుక్రవారం రాజమహేంద్రవరం వన్‌టౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన, అధికారులతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు మరియు పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట నిఘా, ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

ముందస్తు చర్యలగా బైండోవర్లు, పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, గొడవలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై బైండోవర్ చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్లను తక్షణమే అమలు చేయాలని అన్నారు.  ఎన్నికల వేళ అసత్య వార్తలు, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేసేవారిపై సోషల్ మీడియా కాదనాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నిరంతర నిఘా ఉంచాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డులు, ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలని, స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో నిరంతరం సమాచారాన్ని సేకరించి శాంతిభద్రతలకు సంబంధించిన పరిణామాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.

పటిష్ట బందోబస్తు...మునుపటి ఎన్నికల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సిబ్బంది అంతా పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సమావేశంలో సెంట్రల్ జోన్ అసిస్టెంట్ ఎస్పీ తరుణ్ పహ్వా,  వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్.మురళి కృష్ణ, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. అప్పారావు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఈ. పవన్ కుమార్ రెడ్డి, ఎస్.బి ఇన్స్పెక్టర్  ఏ.శ్రీనివాసురావు, పోలీస్ స్టేషన్ ఎస్సై లు మరియు సిబ్బంది  పాల్గొన్నారు.