BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రులకు పటిష్ట పోలీసు బందోబస్తు

Select Suryaa Now
రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రులకు పటిష్ట పోలీసు బందోబస్తు

అక్టోబర్ 11 నుంచి 21 వరకు ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నెల్లూరు, అర్బన్, క్రైమ్ ,  మేజర్ న్యూస్ :
నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు.జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల,ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ ఏఎస్పీ, ఎస్డీపీఓ దీక్ష,శుక్రవారం దేవస్థానాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దర్గామిట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణ్ రాజు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ నాయుడు, బందోబస్తు సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, రద్దీ నియంత్రణ చర్యలను సమీక్షించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఏఎస్పీ దీక్ష అధికారులను ఆదేశించారు. భక్తుల వాహనాల కోసం తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించడం, ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడం, అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలు, పాదచారుల రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మార్గాలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కదలికలను గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగ భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.దేవస్థానం నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.భక్తులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తమ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, రహదారులపై వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపి రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత శాఖలు, దేవస్థానం అధికారుల సమన్వయంతో నవరాత్రి ఉత్సవాల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.