శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు
వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక పట్టణంలోని శ్లోకా పాఠశాలను బుధవారం అఘోరి నాగసాధు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, సంప్రదాయబద్ధంగా గురుదక్షిణ సమర్పించి గౌరవించారు. అనంతరం అఘోరి నాగసాధు పాఠశాల ఆవరణాన్ని సందర్శించి అక్కడి పరిసరాలను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిశీలించారు. అలాగే దక్షిణ మూర్తి స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పలు సూచనలు చేసి, ఆశీర్వచనం చేశారు. పాఠశాల ఆవరణం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉందని ప్రశంసించారు. శ్లోక స్కూల్ నందు చదువుతున్న విద్యార్థులు దినదినాభివృద్ధి చెందుతూ మంచి స్థాయిని చేరుకుంటారని ఆశీర్వదించారు.విద్యార్థులకు విద్యాబోధనతో పాటు చక్కటి వాతావరణాన్ని కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డిని అఘోరి నాగసాధు ఆశీర్వదించారు. ఆయన ఆశీస్సులతో పాఠశాల యాజమాన్యం, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతకు విద్యా వాతావరణం తోడైన ఈ సందర్శన పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రిపోర్టర్: గండికోట షేక్ ఖదీర్
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.