BREAKING
ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం!

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Select Suryaa Now
ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, (మేజర్ న్యూస్): రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026’ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఖేలో ఇండియా-2026’ అధికారిక బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ క్రీడా పోటీలను అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు.

డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను, 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పోటీలు జరిగే రోజుల్లో నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని, ఇందుకోసం పోలీస్, మున్సిపల్ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

క్రీడా ప్రాంగణాలు, స్టేడియంల పునరుద్ధరణ పనులతో పాటు క్రీడాకారులకు కల్పించే వసతులు, ఏర్పాట్లలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టంగా హెచ్చరించారు.