BREAKING
శ్లోక పాఠశాలను సందర్శించిన అగోరి నాగ సాధు... కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డికి ఆశీస్సులు పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట - కొత్తగా పింఛన్లు మంజూరు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డా. శివ ప్రసాద్ గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి

Select Suryaa Now
రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి

మంచాల, మేజర్ న్యూస్  : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు చింతకింది శంకర్ డిమాండ్ చేశారు. సబ్సిడీ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను ప్రభుత్వం మభ్యపెట్టిందని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అర్హులైన యువతకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని ఆరోపించారు. స్వయం ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువత ప్రభుత్వ తీరుతో నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా, రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి,జిల్లా.