BREAKING
ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా

పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి

Select Suryaa Now
పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి

సూర్య జగిత్యాల ప్రతినిధి:పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబాల శ్రేయస్సు, చిన్నారుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ రూమ్‌ను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం పండుగలు, పర్వదినాలు, కుటుంబ వేడుకలు అనే తేడా లేకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ గదిలో ఆటవస్తువులు, కూర్చునేందుకు అవసరమైన సౌకర్యాలతో పాటు పిల్లలకు అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల పిల్లలు సంతోషంగా సమయం గడపడమే కాకుండా, తల్లిదండ్రులైన పోలీస్ సిబ్బందికి కూడా కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మహిళా పోలీస్ సిబ్బంది వారి పిల్లలు పాల్గొన్నారు.