BREAKING
వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం! ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత హైదరాబాద్‌లో సరికొత్త ఫుడ్ డెస్టినేషన్లు.. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌కు బెస్ట్ స్పాట్స్! అధికార దర్పం వీడి.. ఎన్నికల సిబ్బందితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఎమ్మెల్యే ఉగ్రకు అఖండ మెజారిటీ కానుకగా ఇస్తా రెవెన్యూ ఉద్యోగులకు టీఎన్జీవోస్ మెంబర్ షిప్ అందజేత

తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

Select Suryaa Now
తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

తాండూరు, మేజర్ న్యూస్: తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాండూరు తాజా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన సతీమణి ఆర్తి రెడ్డి, తల్లిదండ్రులు విఠల్ రెడ్డి, ప్రమోదిని రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో మహా పడిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విఠల్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, నర్సింలు, మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్:పంజుగుల రామచందర్, తాండూరు, వికారాబాద్ జిల్లా.