ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎఫ్‌ఏ-2 పరీక్షల ఫలితాలపై ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఫలితాలు, విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..