BREAKING
కార్యకర్తలకు అండగా ఉంటాం పేదల గొంతుకగా.. ప్రజల మనిషిగా.. సర్పంచ్ బరిలో బిందునగర్ మారుతిరెడ్డి! గతంలో ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పోరాటం.. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందడుగు! ఇరాన్ సైన్యంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు! గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి *దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు* ఐవీఎఫ్‌ అండాల దందాలో కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ!

హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు!

Select Suryaa Now
హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు!

హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని హుస్సేనాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సామన్నగారి రాము ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ మద్దతు కోరారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా తనకు కేటాయించిన కత్తెర గుర్తును ప్రజలకు వివరిస్తూ, ఆ గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అందరూ కలిసి తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.