telangana
పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ
హైదరాబాద్, (మేజర్ న్యూస్): రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన 'పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పౌల్ట్రీ పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పౌల్ట్రీ రంగాన్ని త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ'లో పౌల్ట్రీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన భూమిని కేటాయిస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.