గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లాలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ తాత్కాలిక ఏర్పాట్ల ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు.బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గోదావరి పుష్కరాలు–2027 తాత్కాలిక ఏర్పాట్లపై జిల్లా శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు జిల్లాలోని వివిధ ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, వసతి తదితర అన్ని అంశాలపై ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్ ,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.