BREAKING
గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి *దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు* ఐవీఎఫ్‌ అండాల దందాలో కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ! నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ పైసల్లేవని ప్రియురాలే వదిలేసింది: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ ఎమోషనల్ వ్యాఖ్యలు! బిగ్‌బాస్ 10 తెలుగు: బడ్డీ అప్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్! జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ

5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

Select Suryaa Now
5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
అమరావతి, (మేజర్ న్యూస్): ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా అత్యంత కీలకమైన ‘పెట్టుబడుల రక్షణ చట్టం’ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరిగినా, ప్రభుత్వాలు మారినా గత ఒప్పందాలకు, పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ చట్టం పటిష్టమైన రక్షణ కల్పించనుంది.

పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రకటించే ప్రోత్సాహకాలు, రాయితీలు, భూముల కేటాయింపులకు పూర్తిస్థాయి చట్టపరమైన భరోసా ఉండేలా ఈ బిల్లును రూపొందిస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడనుంది. మరోవైపు, ఈ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులు, పనుల పురోగతిపైనా సభలో విస్తృతంగా చర్చించనున్నారు. వీటితో పాటు పలు ఇతర కీలక బిల్లులు, ప్రజా సమస్యలపైనా అసెంబ్లీ వేదికగా చర్చ జరగనుంది.