national
సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు
చెన్నై/న్యూఢిల్లీ, (మేజర్ న్యూస్): కార్తీక దీపం వెలిగించే విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది.
ఈ అంశంపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరణ ఇస్తూ, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆలయ యంత్రాంగం అనుమతి నిరాకరించడం వల్లే తాము కార్తీక దీపాన్ని వెలిగించలేకపోయామని పేర్కొన్నారు. నిబంధనలు, ఆలయ అధికారుల అభ్యంతరాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుపుతూ, జరిగిన పరిణామాలకు గాను తమిళనాడు సర్కార్ న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పింది.