కార్యకర్తలకు అండగా ఉంటాం
నవాబుపేట సూర్య న్యూస్: బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని మాజీ మంత్రి డాక్టర్.లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.బుధవారం బీఆర్ఎస్ యువ నాయకుడు అభిమన్యు రెడ్డితో కలిసి మండలంలోని పోమాల,జంగమయ్యపల్లి గ్రామాల్లో పర్యటించి పలు శుభకార్యాలు,పరామర్శ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోమాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తమ్ముడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే జంగమయ్యపల్లిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జంగమయ్యపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సాలె రమేష్ పాము కాటుకు గురైన విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు అండగా ఉంటామని,వారి కష్టసుఖాల్లో ఎల్లవేళలా తోడుగా నిలుస్తామని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్,సంతోష్ రెడ్డి,గండు చెన్నయ్య,ప్రతాప్,మాజీ సర్పంచులు గోపాల్ గౌడ్,యాదయ్య,కే.కృష్ణయ్య,కృష్ణయ్య గౌడ్,అబ్దుల్లా,నరసింహులు తాహేర్,శ్యామసుందర్ రెడ్డి,లింగంపల్లి తిరుపతయ్య,రఘు గౌడ్,పోమాల గుట్టమీది వెంకటేష్,యాదయ్య,రమేష్ గౌడ్,పాండు,జంగమయ్యపల్లి బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపాల్,గ్రామస్తులు వెంకటయ్య,రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.