*దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు*
కొండపోచమ్మ ఆలయ అధికారి మైసయ్య పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.దళిత ప్రజాప్రతినిధులను అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం సిద్దిపేట జిల్లా జదేవపూర్ మండలపరిధిలోని తీగుల్ నర్సపూర్ సర్పంచి ని అవమానించిన ఘటనపై సంబంధిత వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజలచే ఎన్నుకోబడిన దళిత సర్పంచికి తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. కులం పేరుతో లేదా సామాజిక హోదాను అడ్డుపెట్టుకొని ప్రజాప్రతినిధులను అవమానించడం ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.ఈ ఘటనకు సంబంధించి కొండపోచమ్మ ఆలయ అధికారి మైసయ్యపై సమగ్ర విచారణ చేపట్టి, బాధితుడి ఫిర్యాదు మరియు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దళిత ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన గౌరవం, హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.దళిత సర్పంచులకు గౌరవం కల్పించాలి.. అవమానించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి .(అనిల్ జగదేవపూర్ మండల రిపోర్టర్)