నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ
యాలాల, మేజర్ న్యూస్: యాలాల మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌వీ వైన్‌షాప్‌ను దొంగలు మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో దుకాణం గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.50 వేల నగదుతో పాటు ఐదు ఫుల్ బాటిళ్ల మద్యాన్ని అపహరించి పరారయ్యారు. ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సుమారు నాలుగు నెలల క్రితం ఇదే వైన్‌షాప్ పైకప్పు రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాజాగా మరోసారి అదే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని గోడకు రంధ్రం చేసి చోరీకి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకే వైన్‌షాప్‌లో నాలుగు నెలల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరగడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.