BREAKING
బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ! నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ పైసల్లేవని ప్రియురాలే వదిలేసింది: ఈఎన్‌ఈ రిపీట్ వేదికపై విశ్వక్ సేన్ ఎమోషనల్ వ్యాఖ్యలు! బిగ్‌బాస్ 10 తెలుగు: బడ్డీ అప్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ.. ముకేశ్‌కు దివ్య స్ట్రాంగ్ కౌంటర్! జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే.. టికెట్ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ స్వామి! పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్ ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. పసుపు కలర్ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. 26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం

జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ

Select Suryaa Now
జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ

 జగదేవపూర్ మేజర్ న్యూస్ (అనిల్ జగదేవపూర్ రిపోర్టర్)

పోలీస్ కమిషనర్  రష్మి పెరుమాళ్, ఐపిఎస్  మంగళవారం జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పనితీరును, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ పోలీస్ స్టేషన్ ఆవరణ, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో సిబ్బంది మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.స్టేషన్ పరిధిలోని సీజ్ చేసిన వాహనాలు, ఇతర క్రైమ్ ప్రాపర్టీని పరిశీలించి, వాటి భద్రత మరియు రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు. అత్యవసర సమయంలో ‘డయల్ 112’కు ఫోన్ కాల్ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. నేరాల నియంత్రణ మరియు గ్రామాల భద్రత కోసం ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వద్ద నిర్వహిస్తున్న రాముడు బండ జాతరను సీపీ గారు సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ గ్రామీణ సీఐ రవి రాజు, ఎస్ఐ కృష్ణ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.