వారాహి మెడికల్ స్టోర్స్ ప్రారంభం
చౌటుప్పల్, మేజర్ న్యూస్: మండలంలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన పిల్లలమర్రి ప్రశాంత్ ధర్మోజిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌ను గ్రామ సర్పంచ్ జువ్వి నరసింహ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పిల్లలమర్రి ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలకు అవసరమైన నమూనాల సేకరణ కోసం ఉచిత హోమ్ విజిట్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దామెర గ్రామ సర్పంచ్ సాతిరి శ్రీధర్ రావు, ఉపసర్పంచ్ పకీర్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, సామిడి సంధ్య, నాగరాజు రెడ్డి, అయితే రాజు, శారద, లింగస్వామి, రాచకొండ భార్గవ్, జంగం వెంకటమ్మ, అంజయ్య, ఇప్ప పుండరికం తదితరులు పాల్గొన్నారు.